»   » వెంకీ ఇది నిజమా...రూమరా?

వెంకీ ఇది నిజమా...రూమరా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'దృశ్యం' విజయంతో వెంకటేష్ ఉత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పిల్ల జమీందారు అశోక్ తయారు చేసిన మూకీ స్క్రిప్టుకి ఆయన ఓకే చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఎక్కడా వార్తాలు లేవు. గతంలో ఈ విషయమై కొంతకాలం సురేష్ సంస్ధలో ప్రపోజల్స్ నడిచాయని చెప్పుకున్నారు.

వెంకటేష్ త్వరలో ఓ మూకీ సినిమాలో కనపించనున్నారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ప్రతీ సారి హీరోయిజం కన్నా వైవిధ్యతకు పెద్ద పీట వేసే వెంకటేష్ ఈ మధ్యనే ఈ తరహా స్క్రిప్టుని ఓకే చేసినట్లు తెలుస్తోంది. 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ ఇటీవలే వెంకటేశ్‌ని కలిసి ఓ కథ చెప్పారట. ఆ కథ విని వెంకటేశ్ బాగా ఇంప్రెస్ అయినట్టుగా సమాచారం. కమల్‌హాసన్ 'పుష్పక విమానం' తరహాలో మూకీ సినిమాగా ఆ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందనేది ఫిలింనగర్ వర్గాల సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలోనే ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది.

Venkatesh to do a Silent Movie!

గతంలో వెంకటేష్ ఇదే విషయమై మాట్లాడుతూ... ''ఇరవయ్యేళ్ల తర్వాత మాటల్లేకుండా ఓ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పుష్పకవిమానం'కి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. నటుడిగా నాకొక ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చే చిత్రమవుతుంది. మిగతా విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తాను''అన్నారు.

యంగ్ హీరోల జోరు పెరుగుతున్న నేపథ్యంలో ఫేడౌట్ స్టేజీలో ఉన్న వెంకటేష్ హీరోగా కెరీర్ ముగిసేలోగా వీలైనన్ని వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వస్తే తెలుగులో మూకీ సినిమా చేసిన తొలి హీరోగా వెంకటేష్ చరిత్రకెక్కనున్నారు.

English summary

 
 Venkatesh is ready to experiment with a ‘Silent Movie’ (Mookhi). This film will be directed by ‘Pilla Zamindar’ fame Ashok and Venkatesh has already given a green signal to Ashok’s script.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu