త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్?
విక్టరీ వెంకటేష్, క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతోందా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన కథకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తన స్టయిల్‌లో త్రివిక్రమ్ ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ హీరోగా 'జులాయి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రం పూర్తయిన తర్వాత వెంకీతో చేయబోయే సినిమాకు వర్క్ స్టార్ చేసే అవకాశం ఉంది. మరో వైపు వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకికట్లో సిరిమల్లె' చిత్రంతో పాటు మెహర్ రమేష్‌తో 'షాడో' చిత్రానికి కమిట్ అయ్యారు.
ఆ మధ్య వరుస ప్లాపులు చవిచూసిన వెంకీ ఈ మధ్య ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. ప్రయోగాల జోలికి పోకుండా కేవలం ఫ్యామిలీ ప్రేక్షకులు, యూత్ మెచ్చేలా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంటు కలిపి ఉండే సినిమాలకే ఓటేస్తున్నాడు. వెంకీ చివరిగా బాడీగార్డ్ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ సినిమాలు అంటే అస్సలు బోర్ కొట్టదనే పేరుంది. కథా బలం లేకున్నా స్క్రీన్ ప్లే, డైలాగులతో సినిమాను నెగ్గుకు రాగల నేర్పరి. ఈనేపథ్యంలో అతనితో సినిమా చేయడం సేఫ్ జోనే అని వెంకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











