పండుగ బరిలో వెంకటేష్ మూవీ.. థియేటర్స్ లో హిట్టు కొట్టేందుకు డేట్ ఫిక్స్?

గత కొంతకాలంగా చిన్న సినిమాల నుంచి మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువగా ఓటీటీలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే సడన్ గా వెంకటేష్ లాంటి సీనియర్ హీరో కూడా ఓటీటీకి మద్దతు పలకడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ అలాగే అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఫైనల్ గా నిర్మాత నిర్ణయానికి కట్టుబడక తప్పలేదు.

బిజినెస్ పరంగా ఆలోచిస్తే అదే సేఫ్ జోన్ అని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక నారప్ప సినిమా ఓటీటీలో విడుదల అవ్వడంపై వెంకటేష్ కూడా అప్సెట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ సినిమాను మాత్రం ఎలాగైనా థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మలయాళం హిట్ మూవీ దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సింగిల్ షెడ్యూల్ లోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.

Venkatesh drishyam 2 release date fix target on festival

ఇదివరకే దృశ్యం ఫస్ట్ పార్ట్ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. తప్పకుండా దృశ్యం 2కు కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారని నిర్మాత సురేష్ బాబు నమ్ముతున్నారు. ఈ సినిమాకు కూడా నారప్ప తరహాలోనే ఓటీటీ ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ సినిమాను ఎలాగైనా వినాయకచవితికి థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న F2 సినిమా 2022 సంక్రాంతికి విసుదల కానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X