వెంకీ సినిమాకీ ఆ సమస్య?
వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందనున్న నమో వెంకటేశ చిత్రంపై అంచనాలుతో అనుమానాలు వినపడుతున్నాయి. ఈ చిత్రం మేకింగ్ ప్రారంభం కాకుండానే ఓవర్ బడ్జెట్ అయ్యేటట్లు ఉందంటున్నారు. వెంకటేష్ కీ, శ్రీను వైట్లకీ ఇచ్చే రెమ్యునేషన్స్ కలిపితేనే దాదాపు పది కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనావేస్తున్నారు. గిరి నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ త్రిషకు సైతం బాగానే ముట్టచెప్తున్నారని అంటున్నారు. అలాగే సంగీత దర్శకుడు, మిగతా టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీలో పెద్ద వారిని తీసుకుండటంతో దానికీ నాలుగు కోట్ల అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే షూటింగ్ బడ్జెట్ కన్నా ఇవే సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటున్నారు. దాంటో అసలు ఖర్చుపెట్టాల్సిన షూటింగ్, స్క్రిప్టు పనులకు బడ్జెట్ సహకరించక అక్కడ లో బడ్జెట్ లో లాగించటం జరుగుతోందంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్ధితి చిరంజీవి సినిమాలకు ఏర్పడేదని, ఇప్పుడు ప్రతీ స్టార్ హీరో తన రెమ్యునేషన్స్ పెంచటంతో అంతటా అదే పరిస్ధితి వస్తోందంటున్నారు.


Click it and Unblock the Notifications











