గోపీచంద్ పై మండిపతున్న వెంకటేష్
వెంకటేష్ చాలా కూల్ గా ఉంటాడని,డైరక్టర్స్ హీరో అని చెప్తూంటారు.అయితే తాజాగా ఆయన తనతో పనిచేస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని పేరు చెపితే చాలు మండిపడుతున్నాడని చెప్తున్నారు.దానికి కారణం గోపీచంద్ కి సీన్స్ పై క్లారిటీ లేకపోవటం, పూర్తి గా స్క్ర్రిప్టు పై గ్రిప్ లేక డైలాగ్స్ ,మూడ్ చెప్పలేకపోతున్నాడని వినికిడి. వెంకటేష్ సీన్ కు ముందు అడిగే ప్రశ్నలకు క్లారిఫికేషన్ ఇవ్వలేక కో డైరక్టర్స్ పై ఆధారపడుతున్నాడని,ఇది వెంకీకి గిట్టడం లేదని అంటున్నారు.దర్సకుడే కన్పూజ్ అవ్వటంతో యూనిట్ వారుకి కూడా ఇబ్బందిగా ఉంటోందని ఫిల్మ్ నగర్ లో టాక్. అందులోనూ నాగవల్లి ప్లాప్ కావటంతో బెల్లంకొండకు హిట్టవ్వాలనే ఆలోచనతో బాడీగార్డు రీమేక్ కమిటయ్యాడు.ఇది హిట్టు కావాలి అనుకుంటూంటే ఇలా డౌట్స్ తో ముందుకెళితే పరిస్దితి ఏమిటని విసుక్కుంటున్నాట్ట.ఇక గోపీచంద్ మలినేని మొదటి సినిమా డాన్ శీను యావరేజ్ గా ఆడింది. రవితేజ కామిడికి పేరు వచ్చినంతగా దర్సకుడుకి మాత్రం పేరు రాలేదు.


Click it and Unblock the Notifications











