వెంకటేష్ ఘోస్ట్ డైరక్షన్ చేసేస్తున్నాడా
వెంకటేష్ తాజా చిత్రం బాడీగార్డ్ పై రోజుకో న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారమవుతుంది. తాజాగా ఈ చిత్రాన్ని వెంకటేష్ స్వయంగా డైరక్ట్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం దర్శకత్వంపై వెంకటేష్ కు నమ్మకం కుదరక ఇలా మొదలెట్టాడంటున్నారు. అలాగే ఎప్పుడో రీమేక్ రైట్స్ తీసుకున్న బెల్లంకొండ తీరబడిగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టి విడుదల ఆలస్యమయ్యేలా చేసారు. ఈ లోగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న బాడీగార్డు విడుదలైంది. ఆ దెబ్బతో చాలా మంది ఈ సినిమాను చూసేసారు. దాంతో తమ చిత్రంలో కొత్తగా ఏం చూపెట్టాలో తెలియక దర్శకుడు తల పట్టుకు కూర్చున్నాడు. ఎందుకంటే దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. మరో ప్రక్క బెల్లంకొండ అంతకుముందు నాగవల్లి చిత్రం కూడా వెంకటేష్ తోనే చేసాడు. ఆ సినిమా కూడా రీమేకే. ఆ సినిమా భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. దాంతో వెంకటేష్ ఈ చిత్రం ఏమవుతుంది. ఈ సినిమా కూడా ఫెయిలైతే తన ఇమేజ్ పరిస్ధితి ఏమిటన్న ఆలోచనలో పడి దర్శకుడుపై పైర్ అవుతున్నాడు. ఎట్టి పరిస్దితుల్లోనూ సినిరామా నిలబెట్టాల్సిందే అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాని సరిగ్గా చేయటం లేదని బయిట వినపడటంతో బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దాంతో తమ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారానే పూర్తిగా విడుదల చేయాల్సిన పొజిషన్. ఇవన్నీ వెంకటేష్ కి నిద్రపట్టనివ్వటం లేదు.రోజు రోజుకీ ప్రతీ సీన్ కి స్క్రిప్టులో మార్పులు అడగటం, ప్రతీ సారి ఛేంజెస్ రావటం గోపీచంద్ కి మింగుడుపడటం లేదని వినికిడి. ఇక సల్మాన్ ఖాన్ సినిమాను చూసి వచ్చిన వెంకి అందులో హైలెట్ అయిన వాటిని ఎడాప్ట్ చేయమని కోరుతున్నాడుట.అంతేగాక ఆల్రెడీ తీసేసిన సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేద్దామని పట్టుపడుతున్నాడట. హీరోనే అత్యుత్సాహం ల్లచూపిస్తూండటంతో నిర్మాత బెల్లంకొండ కూడా ఏమీ అనలేని పరిస్దితి నెలకొని ఉంది. ఇదే సినిమా తమిళ రీమేక్ లో విజయ్, అసిన్ జత కట్టారు.అయితే తమిళ సినిమా ఆడలేదు. హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ చేసారు. గతంలో వెంకీ, త్రిష కలిసి 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే', 'నమో వేంకటేశ' సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











