ఆ డైరెక్టర్ కి వెంకి డేట్స్?
"ఓయ్" చిత్రం తో ఈ శుక్రవారం మన ముందుకు వచ్చిన నూతన దర్శకుడు ఆనంద్ రంగకి వెంకటేష్ తనని డైరెక్ట్ చేసే అవకాసం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. "ఓయ్" సినిమా రిజల్ట్, పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా తెరపై కథ చెప్పిన విధానం ఆకట్టుకుందని వెంకి అన్నట్లు సమాచారం. దాంతో కామెడి, సెంటిమెంట్ కలిసిన కథ తెచ్చుకోమని వెంకి ఆ దర్సకుడుకి చెప్పారని వినపడుతోంది.
అయితే ఇప్పటికే వెంకి అమ్మ రాజశేకర్ తో ఓ చిత్రం, శ్రీను వైట్ల తో నమో వెంకటేశా చిత్రం కమిట్ అయ్యారు. అంతే కాక మరో రొండు చిత్రాల స్టొరీ సిట్టింగ్స్ సైతం జరుగుతున్నాయి. మరో ప్రక్క వెంకటేష్ ఈనాడు సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దాంతో తమ వంతు వచ్చే సరికి బాగా లేట్ అయ్యేటట్లు ఉందనే డైరెక్టర్ మెహర్ రమేష్ అశ్వని దత్ సినిమా కమిట్ అయ్యారని సమాచారం.
ఇక తన తొలి చిత్రం తోనె ఆనంద్ రంగ టెక్నికల్ గా బాగానే ప్రూవ్ చేసుకున్నడనే టాక్ పరిశ్రమ వర్గాలలో బాగా వినపడుతోంది. దాంతో పెద్ద హీరో లలో ఆనంద్ పై ఎంక్వయిరీ ఇప్పటకే ప్రారంభమైంది. ఈలోగా వెంకటేష్ చిత్రం ఓకే అయితే అతని కేరియర్ మలుపు తిరిగినట్లే అంటున్నారు సీనియర్స్. అయితే కొంత మందికి మాత్రం వెంకటేష్ ఇలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వటం మాత్రం మింగుడు పడటం లేదు.


Click it and Unblock the Notifications











