twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Valtheru Veerayya: చిరంజీవి సినిమాలో మరో బడా హీరో.. ముగ్గురు స్టార్లతో సూపర్ ప్లాన్

    |

    గతంలో కంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఇలా పలు సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు.

    ఇలా ఇప్పుడు ఏకకాలంలోనే కొన్ని సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. అందులో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఒకటి. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరో నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

    బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఆచార్య మూవీ

    బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఆచార్య మూవీ

    వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న చిరంజీవి ఇటీవలే 'ఆచార్య' అనే మూవీతో వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఇందులో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశ పరిచింది. దీంతో ఈ మూవీ రూ. 80 కోట్లకు పైగా నష్టాలు చవి చూసింది.

    హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

    ఆ రెండు సినిమాలు పూర్తి చేస్తూ

    ఆ రెండు సినిమాలు పూర్తి చేస్తూ

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను 'గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీన్ని మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. దీని తర్వాత తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను దాదాపుగా పూర్తి అయ్యాయి.

    వాల్తేరు వీరయ్యగా మారిన చిరు

    వాల్తేరు వీరయ్యగా మారిన చిరు

    వరుస హిట్లతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారని తెలిసిందే.

    యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

    మెగాస్టార్ కోసం వచ్చిన రవితేజ

    మెగాస్టార్ కోసం వచ్చిన రవితేజ

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ ఎప్పుడో ప్రకటించాడు. దీంతో ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

    షూట్ కూడా... ఇద్దరితో రచ్చగా

    షూట్ కూడా... ఇద్దరితో రచ్చగా

    క్రేజీ సబ్జెక్టుతో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, అతడికి సంబంధించిన ఓ వీడియోను కూడా చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే వదిలింది. ఇందులో రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నట్లు చూపించారు. అంతేకాదు, అతడితో కలిసి చిరంజీవి అదిరిపోయే సాంగ్‌ను చేయబోతున్నట్లు కూడా ఓ న్యూస్ లీకైంది.

    బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

    చిరంజీవి సినిమాలో వెంకటేష్

    చిరంజీవి సినిమాలో వెంకటేష్

    వైవిధ్యమైన కథతో కమర్షియల్ పంథాలో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజతో పాటు మరికొందరు స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులను ఇందులో చూపించబోతున్నారట. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు తాజాగా తెలిసింది.

    కాసేపే అయినా అదిరిపోయేలా

    కాసేపే అయినా అదిరిపోయేలా

    మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కలయికలో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ రోల్ ఐదు నిమిషాల లోపే ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ పాత్ర వచ్చిన సమయంలో సీన్స్ అదిరిపోయేలా ఉంటాయట. ఇక, ఈ సినిమా కోసం వెంకీ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం.

    English summary
    Megastar Chiranjeevi Now Doing a Movie Under K. S. Ravindra Direction. Daggubati Venkatesh Plays Guest Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X