twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డెఫిషిట్ లో వెంకటేష్ ‘షాడో’

    By Srikanya
    |

    హైదరాబాద్: వెంకటేష్, తాప్సీ జంటగా యునైటెడ్ మూవీస్ ప్రై.లి. పతాకంపై మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'షాడో'. ఈ చిత్రం డెఫిషిట్ లో విడుదల కానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాదాపు ఎనిమిది కోట్లు వరకూ డెఫిషిట్ తో నిర్మాత విడుదల చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవటం....వెంకటేష్ సోలో హీరో చిత్రాలు వరస ప్లాపుల్లో ఉండటం.. మెహర్ రమేష్ కు సైతం మార్కెట్ లేకపోవటం...ప్రాజెక్టుకు క్రేజ్ రాకపోవటం వంటి విషయాలతో డెఫిషిట్ కి చేరిందని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.

    చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ- పక్కా మాస్ ఫిలిమ్‌గా నిర్మించిన 'షాడో' రివేంజ్ ఫార్మాట్‌లో ఉంటూ తల్లి, చెల్లి సెంటిమెంట్ కథతో అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. చిత్రంలోని మాస్ పాటలు కలర్‌ఫుల్‌గా ఉంటాయని, హెలీ యాక్షన్ లేకుండా చాలా సింపుల్ మెథడ్‌లో మాస్‌గా దర్శకుడు తీర్చిదిద్దారని, తన పాత్రకు రెండువైపులా మాస్ ఎలిమెంట్స్ ఉంటూ ప్రేక్షకులకు యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని అన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, టైటిల్ సాంగ్ అద్భుతంగా కుదిరిందని, 'నాటీ నాటీ గర్ల్' అనే పాట మంచి హిట్ సాధించిందని తెలిపారు. 'పిల్ల మస్తు' పాట కూడా పక్కా మాస్ సాంగ్‌గా అలరిస్తోందనీ, తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు.

    అలాగే బాడీగార్డ్ కథ రీమేక్ కనుక ఫిక్స్‌గా ఉందని, షాడో కథ మాత్రం అన్ని హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిఫరెంట్ లుక్‌తో ఉంటుందని తెలిపారు. షాడోగా తన గెటప్ మొదటినుంచీ న్యూలుక్‌తో ఉందని, అది సినిమా చూశాక ప్రేక్షకులకు తెలుస్తుందని అన్నారు. షాడో అనే టైటిల్ కూడా చిత్రానికి ఖచ్చితమైన పేరని, షాడోగా ఉంటూనే హీరోగా చేసే పనులన్నీ తాను చేస్తానని అన్నారు. ఇక ఫైట్స్ ఇప్పుడొస్తున్న విధంగా కాకపోయినా తనకు బెటర్‌లా అనిపించిన విధంగా చేయడానికి ప్రయత్నించానని, శ్రీకాంత్ పాత్ర చిత్రమంతా సాగుతూ ఉంటుందని అన్నారు.

    అలాగే ఎం.ఎస్.నారాయణ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుందని, మెహర్ రమేష్ సక్సెస్ రేట్‌ను చూసి తాను ఈ చిత్రాన్ని ఇవ్వలేదని తెలిపారు. మాస్ ఫిలింస్ చేస్తున్న అతను ఓ సరికొత్త కథతో రావడంతో తాను చిత్రాన్ని చేయడానికి నిర్ణయించుకున్నానని, వేసవిలో రాబోతున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన వివరించారు.

    English summary
    Venkatesh, Tapsi starrer film ‘Shadow’ directed by Meher Ramesh is bracing for grand release on Telugu New Year Ugadi on 11th April. Srikanth and Madhurima are playing important roles in the film while Thaman scored music. However, according to insiders, financial problems have surrounded on Shadow release. Buzz is Parachuri Prasad who is producing the film is in Rs 8crs deficit. As of now film makers are going ahead with their grand release plans and has to be seen how they will wriggle out of the financial crunch and smooth release of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X