బాలకృష్ణను కాదు రజనీని ఇమిటేట్ చేస్తున్నాడు
హైదరాబాద్: తెరపై ఓ హీరో మరో స్టార్ హీరోని ఇమిటేట్ చేస్తే నవ్వులు పండటం ఖాయం. ఆ విషయం వెంకటేష్ కి తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ ని తన తాజా చిత్రం దృశ్యం లో ఇమిటేట్ చేయబోతున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రంలో బాలకృష్ణను ఇమిటేట్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. అయితే బాలకృష్ణను ఇమిటేట్ చేస్తే...తర్వాత కామెడీ చేసారని అటు బాలయ్య అభిమానుల నుంచి సమస్య వస్తుందనే భావించి ఆయన్ను వద్దనుకుని రజనీని ఇమిటేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ మిమిక్రి ఆర్టిస్టు చేత వెంకటేష్ కి ఆ బిట్ కి డైలాగులు చెప్పించారని సమాచారం. థియోటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
కనిపించేదంతా నిజం కాదు అనే ట్యాగ్ లైన్ తో వెంకటేష్ తాజా చిత్రం 'దృశ్యం' ఫస్ట్ లుక్ వచ్చి అందరి మన్ననలూ పొందింది. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'దృశ్యమ్' సినిమాని తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనా నటిస్తున్న జూలై 11 న విడుదల చేయటానికి నిర్ణయించారు.

ఓ మధ్య తరగతి కుటుంబం. ఆ ఇంట్లోంచి ఇద్దరు అమ్మాయిలు రోజూ కళాశాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో వీరిని మధ్యలో అటకాయించి కొందరు యువకులు ఇబ్బంది పెడుతుంటారు. ఒకానొక సందర్భంలో దాడులకు దిగడానికీ సిద్ధమవుతారు. ఈ సమయంలో ఆ అమ్మాయిలు ఏం చేశారు.. వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనే అంశం నేపథ్యంలో వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో మీనా కథానాయిక. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యమ్'కిది రీమేక్. ఇందులో మోహన్‌లాల్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
''మానవ సంబంధాలు, బంధాలు, ఆత్మీయతలు, వినోదం మేళవింపుతో వస్తున్న చిత్రమిది. దర్శకురాలు సినిమాను ఆద్యంతం ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. వెంకటేష్, మీనా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి'' అంటోంది చిత్రబృందం. చిత్రంలో నదియ, కృష్ణచైతన్య, బేబీ ఎస్తర్, కృతిక, కళాభవన్ షాజన్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











