twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటల్ ఎంట్రీకి సిద్దమయిన సీనియర్ హీరో.. ఆ కుర్ర దర్శకుడికి అవకాశం!

    |

    ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం స్టార్ దర్శకుల కోసం వెయిట్ చేయడం లేదు. దర్శకుడు చెప్పిన కథలో కంటెంట్ ఉంటే వాళ్లతో ప్రొసీడ్ అవ్వడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే పలువురు తమ సొంత బ్యానర్ లో కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తుంటే దగ్గుబాటి హీరో వెంకటేష్ మాత్రం ఏకంగా రెండు సినిమాలు అనుభవం ఉన్న దర్శకుడికి తనను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది థియేటర్ రిలీజ్ కోసం కాదని అంటున్నారు.

    అమెజాన్ ప్రైమ్ లో సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఒక డిజిటల్ సినిమా డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ ను హీరోగా అనుకోగా ఆయన కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాలు చేసిన వెంకటేష్ మహాకి పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

    Venkatesh Maha to direct Venkatesh Daggubati

    ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని కాస్త కరోనా పరిస్థితులు చక్కబడ్డాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి షూటింగ్ కూడా చేయాలని భావిస్తున్నాను అని తెలుస్తోంది.

    వెంకటేష్ ఈ మధ్యనే నారప్ప సినిమా షూటింగ్ పూర్తి చేశారు.. ఆ తర్వాత దృశ్యం 2 సినిమా షూటింగ్ లో వెంకటేష్ తన పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం ఆయన ఎఫ్3 సినిమాకి షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే అనిల్ రావిపూడికి గతంలో కరోనా సోకిన సమయంలో ఈ సినిమా షూటింగు నిలిపివేశారు.. మళ్లీ కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే వెంకటేష్ - వెంకటేష్ మహా సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

    English summary
    Hero victory Venkatesh is busy with back to back films. recently some reports state that he gave nod to young director Venkatesh maha, for his digital debut. as per reports this movie is going to release in Amazon prime video exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X