మరొక రీమేక్ సినిమాతో సిద్దమైన వెంకటేష్.. ఈసారి డైరెక్ట్ గా థియేటర్స్ లోనే..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా సినిమాలు చేసే హీరో విక్టరీ వెంకటేష్ టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. సినిమా కథ, షెడ్యూల్ ప్లాన్ కరెక్ట్ గా సెట్ అయితే వెంకీ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న వెంకటేష్ వరుస విజయాలను కూడా అందుకుంటున్నాడు. ముఖ్యంగా F2 తర్వాత ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు. ఆ తర్వాత వెంకీమామ తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు. కేవలం సోలో హీరోగానే కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఈ దగ్గుబాటి హీరో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే లాగా ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు. అయితే అందులో ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉండడం విశేషం.

వెంకటేష్ ఇటీవల చేసిన నారప్ప సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ మూవీ అసురన్ కు రీమేక్ గా వచ్చింది. నిర్మాత సురేష్ బాబు మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని ప్రణాళికలు కూడా రచించాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల విషయం ఓన్కొలిక్కి రాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశాడు. మొత్తానికి ఆ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే తదుపరి సినిమా మాత్రం ఎలాగైనా థియేటర్లో ని విడుదల చేయాలని వెంకటేష్ చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. మలయాళం మూవీ దృశ్యం 2 సినిమా రీమేక్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కేవలం 50 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేశారు.

Venkatesh malayalam remake drishyam 2 new release date fix,

హాట్ స్టార్ మొదటి పెట్టిన పెట్టుబడికి డబుల్ రేట్ లో ఆఫర్ చేసి సినిమాను కొనుక్కోవలని అనుకుంది. కానీ నిర్మాతలు మాత్రం ఒప్పుకోలేదు. ఇదివరకే వెంకీ నారప్ప సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడం వలన తదుపరి సినిమాతో వెంకీ వెండితెరపై విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దని ఇదివరకే నిర్మాతలతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్స్ లోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాలకృష్ణ అఖండ , వైష్ణవ్ తేజ్ కొండపొలం మహాసముద్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా అదే సమయంలో విడుదల కానున్నాయి. పోటీ ఉన్నప్పటికీ దసరా సమయం కాబట్టి తప్పకుండా వర్కవుట్ అవుతుందని ఎవరికి వారు విడుదల తేదీలని ఫిక్స్ చేసుకున్నారు. మరి దృశ్యం 2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 2 ప్రాంఛైజ్ గా వస్తున్న F3 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరొక హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా వెంకటేష్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక F3 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నాం విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలని కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X