మారుతి దర్శకత్వంలో స్టార్ హీరో ఖరారు

By Srikanya

హైదరాబాద్ : ఈరోజుల్లో, బస్ స్టాఫ్ చిత్రాల దర్శకుడు మారుతి తాజాగా ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. వెంకటేష్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం మారుతి పర్యవేక్షణలో...ప్రేమ కథా చిత్రమ్ అనే టైటిల్ తో చిత్రం రూపొంది విడుదలకు సిద్దమవుతుంది.
మరో ప్రక్క హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్‌' ఆధారంగా వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తారు. డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'సర్వేజనా సుఖినో భవంతు ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రామ్ వాటిని ఖండించారు.

అలాగే ఈ సినిమా లాంఛనంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించి, దేవుని పటాలపై తొలి సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన అంజలి నటిస్తుంది. రామ్‌కి జోడీగా సాజన్‌ పదమ్‌సీని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

ప్రస్తుతం వెంకటేష్ మొహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రంలో నటిస్తుండగా...... రామ్ 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి చిత్రం కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ పై మంచి అంచనాలే ట్రేడ్ లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X