వెంకటేష్-మారుతి కాంబినేషన్ చిత్రం టైటిల్
ప్రస్తుతం మారుతి పర్యవేక్షణలో...ప్రేమ కథా చిత్రమ్ అనే టైటిల్ తో చిత్రం రూపొంది విడుదలకు సిద్దమవుతుంది. మరో ప్రక్క హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్' ఆధారంగా వెంకటేష్, రామ్ హీరోలుగా ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'సర్వేజనా సుఖినో భవంతు ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రామ్ వాటిని ఖండించారు.
అలాగే వెంకటేష్ మొహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన 'షాడో' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మారుతి,అల్లు శిరీష్ ల కాంబినేషన్ లో రూపొందే కొత్త జంట చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ లోగా రాధ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. వెంకటేష్ ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి స్టోరీ లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












