For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్-మారుతి కాంబినేషన్ చిత్రం టైటిల్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈరోజుల్లో, బస్ స్టాఫ్ చిత్రాల దర్శకుడు మారుతి, వెంకటేష్ హీరోగా తాజాగా ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాధ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. వెంకటేష్ తో వచ్చిన తులసి, లక్ష్మి చిత్రాలు విజయం స్పూర్తితో ఈ టైటిల్ ని పెట్టినట్లు సమాచారం.

    ప్రస్తుతం మారుతి పర్యవేక్షణలో...ప్రేమ కథా చిత్రమ్ అనే టైటిల్ తో చిత్రం రూపొంది విడుదలకు సిద్దమవుతుంది. మరో ప్రక్క హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్‌' ఆధారంగా వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'సర్వేజనా సుఖినో భవంతు ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రామ్ వాటిని ఖండించారు.

    అలాగే వెంకటేష్ మొహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన 'షాడో' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మారుతి,అల్లు శిరీష్ ల కాంబినేషన్ లో రూపొందే కొత్త జంట చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ లోగా రాధ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. వెంకటేష్ ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి స్టోరీ లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    English summary
    Victory Venkatesh whose Shadow is up for release is getting ready to star in Ee Rojullo, Bus Stop fame Maruthi. Buzz is both are keen to name the film as 'Radha' going by Venkatesh's hit sentiment with 'Lakshmi' and 'Tulasi'. Maruthi is also directing Sirish in Kotta Janta. After the film Venkatesh film will start.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X