పవన్ ‘షాడో’పై కన్నేసిన వెంకీ?
ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రానికి అంతకు ముందు 'షాడో' అనే టిటిల్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే చివరకు పవర్ ఫుల్ గా ఉందంటూ 'పంజా' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం 'షాడో' టైటిల్ విక్టరీ వెంకటేష్ సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వెంకీ-మెహర్ రమేష్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. 'షాడో' అనే టైటిల్ మాఫియా నేపథ్యం ఉన్న కథలకు సరిగ్గా సరిపోతుందనే కారణంతో ఈ టైటిల్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తోంది. నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనున్నాడు. కోన వెంకట్, గోపీ మోహన్ ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ డైలాగులు రచించే పనిలో నిమగ్నమై ఉన్నారు. పరుచూరి ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి వెంకీ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం వెంకీ నటించిన బాడీగార్డ్ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా పూర్తి ఫ్యామిలీ అండ్ ఎంటర్ టైనర్ అని ఆడియన్స్ టాక్. ఇందులో వెంకీ పండించిన కామెడీకి, యాక్షన్ సీన్లుకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











