twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దసరా అల్లుడు కాదు.. డిసెంబర్ మామ.. అర్థంకాలేదా? అయితే ఓ లుక్కేయండి

    |

    టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్‌. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అంటే రియల్ మామతో రీల్ అల్లుడు నటిస్తున్నాడన్నమాట.

    సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్ మాత్రం దగ్గుబాటి, అక్కినేని అభిమానులను కాస్త నిరాశ పరుస్తోంది.

     Venkatesh, Naga Chaitanya Movie Venky Mama update

    ఇంతకీ విషయమేంటి? అంటారా.. దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మామఅల్లుళ్ళు కాస్త వెనక్కి తగ్గారట. అదేనండీ 'వెంకీమామ' సినిమా వాయిదా పడిందట. ముందుగా దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో ఇతర సినిమాల పోటీ కారణంగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. అదన్నమాట అసలు సంగతి!.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. As per latest talk On this movie Naga Chaitanya face the problems with Daggubati Venkatesh. Now from this movie latest poster released and viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X