Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దసరా అల్లుడు కాదు.. డిసెంబర్ మామ.. అర్థంకాలేదా? అయితే ఓ లుక్కేయండి
టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అంటే రియల్ మామతో రీల్ అల్లుడు నటిస్తున్నాడన్నమాట.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో వస్తున్న ఈ సినిమా అప్డేట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా వచ్చిన ఓ అప్డేట్ మాత్రం దగ్గుబాటి, అక్కినేని అభిమానులను కాస్త నిరాశ పరుస్తోంది.
ఇంతకీ విషయమేంటి? అంటారా.. దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మామఅల్లుళ్ళు కాస్త వెనక్కి తగ్గారట. అదేనండీ 'వెంకీమామ' సినిమా వాయిదా పడిందట. ముందుగా దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో ఇతర సినిమాల పోటీ కారణంగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. అదన్నమాట అసలు సంగతి!.