twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యం :వెంకటేష్ నెక్ట్స్ ... ఆ దర్శకుడుతోనా?

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో చేసిన 'గోపాల గోపాల' తరవాత వెంకటేష్‌ మరో కథకు పచ్చజెండా వూపలేదు. కొన్నాళ్లు ఆయన విశ్రాంతి తీసుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త కథలు వింటున్నారు. అందులో భాగంగా రవిబాబు చెప్పిన కథని వెంకీ ఓకే చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకీ, రవిబాబుకీ మంచి అనుబంధం ఉంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తాజా చిత్రం 'అవును 2' కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చినదే. ఇప్పుడు వెంకీతో చిత్రాన్ని కూడా ఆ సంస్థే తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ''త్వరలోనే ఓ స్టార్ హీరో తో ఓ యాక్షన్‌ చిత్రం చేయబోతున్నా'' అంటూ రవిబాబు కూడా హింట్‌ ఇచ్చేశారు. మరి ఈ కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అయితే వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరోని..రవిబాబు వంటి మోడ్రన్ ఐడియాలజీతో ఉన్న దర్శకుడు ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది.

    Venkatesh next movie with Ravi Babu

    నటుడిగా సినీ రంగానికి పరిచయమైనా... దర్శకుడిగా తనకంటూ ఓ శైలి సృష్టించుకొన్నారు రవిబాబు. 'అల్లరి', 'అనసూయ', 'నచ్చావులే', 'నువ్విలా' చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్నారు. హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాల్ని తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడు అనిపించుకొన్నారు. ఇప్పుడు 'అవును 2'తో మరోసారి భయపెడతానంటూ.... ఈ నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అనుకున్న స్ధాయిలో వర్కవుట్ కాలేదు.

    అయితే రవిబాబు తో చాలా సుఖం ఉందని నిర్మాతలు అంటారు. ఆయన అనుకున్న బడ్జెట్ లోనే చెప్పినట్లు తీసి ఇవ్వగల టెక్నీషియన్. ''స్క్రిప్టు దశలోనే జాగ్రత్తపడితే బడ్జెట్‌ ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది. నేనెప్పుడూ ఒక్క షాట్‌ కూడా వృథాగా తీయను. అందుకే నా సినిమాలన్నీ అనుకొన్న వ్యయంలోనే పూర్తవుతాయి'' అంటారు రవిబాబు.

    English summary
    Venkatesh was going to act under the direction of Avunu2 director Ravi Babu but there was no official confirmation made about this project. And there was a fair chance for this combo to team up, because Ravi Babu revealed that he was preparing an action subject to work with a Star in an interview as well as Ravi Babu’s association with Great Ramanaidu Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X