పుట్టవర్తి సత్య సాయిగా వెంకటేష్?
సత్యసాయి జీవిత కథ ఆధారంగా...భక్తిరస చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ 'సత్యసాయి బాబా" సినిమా రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే గురు పౌర్ణమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య్రక్రమం పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఇందులో 'బాబా" పాత్ర ఎవరూ చేస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సత్య సాయి పాత్ర కోసం ప్రకాష్‌రాజ్, వెంకటేష్ , మరో హీరో పేరును పరిశీలిస్తున్న కోడి.... చివరగా వెంకీ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో...నాగవళ్లి లాంటి డిఫరెంట్ చిత్రాల వైపు దృష్టి సారిస్తున్న వెంకీ... నాగార్జున, బాలకృష్ణల మాదిరి భక్తి రస చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సత్యసాయి జీవితంలో సేవ కోణం పాటు....పలు వివాదాలు ఆయన్ను చుట్టి ముట్టిన నేపథ్యంలో వెంకీ... ఈ పాత్ర చేసేందుకు ఒప్పకుంటాడా? లేదా అనేది సందేహంగా ఉంది. కోడి రామకృష్ణ సన్నిహితులు కోడి ఏదో ఒక రకంగా వెంకీని ఒప్పిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కోడి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











