రామ్ 'మసాలా' రిలీజ్ అప్పుడా?

By Srikanya

హైదరాబాద్ : వెంకటేష్, రామ్‌ హీరోలుగా నటించిన చిత్రం 'మసాలా'. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయభాస్కర్‌.కె దర్శకుడు. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌ నిర్మాతలు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. రీసెంట్ గా హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఇక ఈ చిత్రం నవంబర్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖారున విడుదల అనుకున్నారు కానీ వరస సినిమాలు జోరు తగ్గకపోవటంతో ఇలా నెక్ట్స్ మంత్ కు మార్చారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై దర్శక,నిర్మాతలు ప్రకటన చేయలేదు.

వెంకటేష్ మాట్లాడుతూ... ''మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వినోదం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యమున్న సినిమాలు ఇటీవల చక్కటి ఫలితాల్ని సాధిస్తున్నాయి. మా చిత్రం కూడా అదే తరహాలో ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండబోతోంది. 'విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' చిత్రాల్లో నటించాను. ఇప్పుడు మూడోసారి ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రామ్‌ కీలకమైన పాత్రలో నటించాడు. తన సినీ జీవితంలో ఇదొక మంచి పాత్ర అవుతుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. తమన్‌ చక్కటి బాణీల్ని సమకూర్చాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు .

Masala

రామ్‌ మాట్లాడుతూ ''నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా తీశారు. మద్రాసులో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నప్పుడు నేను సెట్‌కి వెళ్లేవాణ్ని. మళ్లీ అదే బృందం కలిసి పనిచేసిన ఈ సినిమాలో ఇప్పుడు నేను భాగం కావడం ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. వెంకటేష్‌గారితో కలిసి నటించడం ఎంతో సంతృప్తినిచ్చింది. చిత్రసీమకు నాలుగు మూల స్తంభాలుంటే అందులో ఒకరు వెంకటేష్‌. కథ, కథనాలపై నమ్మకంతో ఈ సినిమా చేశాం'' అన్నారు.

దర్శకుడు విజయభాస్కర్‌.కె మాట్లాడుతూ... ''కథని నమ్మి ఈ సినిమాను చేశాం. 'మసాలా' నిజంగా ఒక రుచికరమైన సినిమా అవుతుంది. చాలా వేగంగా చిత్రాన్ని పూర్తి చేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొంటారు'' అన్నారు. ''నాకు నచ్చిన హీరోవెంకటేష్‌గారు. ఆయనతో మరోసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాటలు చాలా బాగున్నాయి''అని చెప్పింది అంజలి.

నిర్మాతల్లో ఒకరైన డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ''పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. పాంచ్‌గని, హైదరాబాద్‌, బ్యాంకాక్‌, జపాన్‌ల్లో చిత్రీకరణ జరిపాం. నెలన్నర కిందటే సినిమా పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. ''ఇందులో అన్ని పాటలూ నేనే రాశాను. విజయభాస్కర్‌లాంటి దర్శకుడితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంద''న్నారు గీత రచయిత రామజోగయ్యశాస్త్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X