పైత్యం చూపకపోతే పెద్ద హిట్టవుద్ది

By Srikanya

హైదరాబాద్ : ఓ సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసేటప్పుడు నేటివిటీ పేరుతో కావల్సినన్ని మార్పులు జరుగుతూంటాయి. ఆ మార్పులు ఒక్కోసారి ప్లస్ అవుతూంటాయి కానీ చాలా సార్లు మైనస్ అవుతూంటాయి. ఒరిజనల్ స్క్రిప్టులోని సోల్ ని ఈ రీమేక్ సినిమా మాయిం చేసేసి,కేవలం పిప్పినే ప్రేక్షకులపై ఒదులుతుంది. దాంతో ఆ సినిమాలు ఫ్లాఫ్ అవుతూంటాయి. ముఖ్యంగా అలాంటి సమస్యలు కమర్షియల్ చిత్రాల రీమేక్ కు ఎదురుకావు. సామాజిక సమస్యలను చిత్రీకరిస్తూ వచ్చిన చిత్రాలకే ఈ సమస్య వస్తుంది. రీసెంట్ గా అనామిక చిత్రం కూడా అదే సమస్య ఎదుర్కొంది. బాలీవుడ్ లో పెద్ద హిట్టైన కహానీ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో యావరేజ్ స్ధాయిని కూడా పొందలేకపోయింది.

ఇప్పుడు అందరి దృష్టీ వెంకటేష్ తాజా రీమేక్... 'దృశ్యమ్‌' పై ఉంది. మలయాళంలో వచ్చిన 'దృశ్యమ్‌' సినిమాని తెలుగులో వెంకటేష్‌ కథానాయకుడిగా రీమేక్‌ చేస్తున్నారు. మీనా హీరోయిన్. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఒరిజనల్ చిత్రం చాలా అద్బుతమమైన స్క్రిప్టుతో రూపొంది ఘన విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్ హీరో కదా... అని కామెడీ పేరుతో ఆ ఫీల్ ని ఖూనీ చేసేస్తారేమో భయపడుతున్నారు. అలా సొంత పైత్యం వాడకుండా చేస్తే పెద్ద హిట్టవుతుందని అభిమానులు అంటున్నారు.

Venkatesh's Drushyam remake latest info.

సాధారణంగా వెంకటేష్‌ సినిమా అంటే షడ్రుచుల మిళితం అంటుంటారు ప్రేక్షకులు. అన్ని రకాల భావాలను తెరపై చూపిస్తారాయన. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ, పోరాటం... ఇలా అన్నీ ఉంటాయి వెంకటేష్‌ సినిమాలో. ఇప్పుడు మరోసారి ఇలాంటి భావాల కలబోతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ''సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కళ్లకు కట్టేలా ఉండబోతోందీ చిత్రం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాల్ని దర్శకురాలు చక్కగా తీర్చిదిద్దుతున్నారు'' అంటున్నాయి నిర్మాతలు.

నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దుతున్నారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరుస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కిస్తున్నారు'' అంటున్నారు.

మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తారు.

వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X