సంక్రాంతి రేస్‌లో మామాఅల్లుళ్లు.. వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నాగచైతన్య హీరోలుగా కె.ఎస్‌. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వెంకీ మామ'. ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో వస్తున్న వెంకీమామ అప్‌డేట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్ మాత్రం దగ్గుబాటి, అక్కినేని అభిమానులను కాస్త నిరాశ పరుస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది డిసెంబర్ కి వాయిదా పడిందని తెలిసింది. ఇదిలా ఉండగానే డిసెంబర్ కాదు జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని సమాచారం అందుతోంది.

Venkateshs Venky Mama Release Date Locked..?

ఇప్పటికే జనవరి 12వ తేదీన అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' విడుదల ఖరారు చేసుకున్నాయి. ఆ రెండు సినిమాలకు పోటీగా జనవరి 14వ తేదీన వెంకీమామ విడుదలకు సిద్దమవుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా రాబోతున్న 'వెంకీమామ' అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' గట్టి పోటీ ఇస్తుందని భాస్తున్నారట మేకర్స్. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.

నిజ జీవితంలో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్‌, నాగచైతన్య ఈ చిత్రంలోనూ మామా అల్లుళ్లుగా కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించారు. ఎస్‌.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X