టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ ఫిక్స్: విక్టరీ వెంకటేష్‌తో కలిసిన మరో మెగా హీరో.!

By Manoj Kumar P

తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచులు, అభిప్రాయాలు మారిపోతున్నాయి. అందుకే టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా మల్టీస్టారర్ మూవీలు రూపొందుతున్నాయి. టాలీవుడ్‌లో ఇప్పటికే ఈ తరహా చిత్రాలు ఎన్నో తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. అలాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన వెంకటేష్‌తో పాటు మరో మెగా హీరో ఇందులో నటించబోతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

పేరులోనే విక్టరీ.. జూనియర్లతో పోటీగా

పేరులోనే విక్టరీ.. జూనియర్లతో పోటీగా

మూవీ మొఘల్ డీ రామానాయుడు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు వెంకటేష్. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరొందిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా అన్నింట్లో జూనియర్లలో పోటీ పడుతుంటాడు. ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉండే దగ్గుబాటి వారి హీరో... తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటారు.

పెద్ద సాహసం చేస్తున్న విక్టరీ వెంకటేష్

పెద్ద సాహసం చేస్తున్న విక్టరీ వెంకటేష్

తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు విక్టరీ వెంకటేష్. ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన ధనూష్ సినిమా ‘అసురన్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ‘నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో వెంకటేష్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

ఆ సినిమాలకు బ్రాండ్ అబాసీడర్‌గా వెంకీ

ఆ సినిమాలకు బ్రాండ్ అబాసీడర్‌గా వెంకీ

ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. వాటిలో ఎక్కువ సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించారు. మహేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల', యంగ్ హీరో రామ్‌తో ‘మసాలా', వరుణ్‌ తేజ్‌తో ‘F2', నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ' అనే సినిమాల్లో ఆయన నటించారు. అలాగే, ఇకపైనా నటిస్తానని చెబుతున్నారు.

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ ఫిక్స్

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ ఫిక్స్

కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఫిల్మ్ మేకర్లు అదే తరహా చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది.

విక్టరీ వెంకటేష్‌తో కలిసిన మరో మెగా హీరో.!

విక్టరీ వెంకటేష్‌తో కలిసిన మరో మెగా హీరో.!

ఇప్పటికే ఎంతో మంది హీరోలతో కలిసి నటించిన విక్టరీ వెంకటేష్.. మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ రెండో హీరోగా నటించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ‘ఎంసీఏ' ఫేం త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిచనున్నారు. త్వరలోనే ఈ మూవీ అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

రవితేజ వెళ్లిపోయాడు.. ఆ హీరో వచ్చాడు

రవితేజ వెళ్లిపోయాడు.. ఆ హీరో వచ్చాడు

వాస్తవానికి ఈ సినిమా కథ వెంకటేష్‌ను ఉద్దేశించే రాసుకున్నాడు దర్శకుడు. అయితే, ఈ సినిమా చేయడానికి ఆయన మక్కువ చూపకపోవడంతో రవితేజను అనుకున్నారు. కానీ, అతడు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో... మళ్లీ ఈ కథ వెంకటేష్‌నే చేరిందని సమాచారం. ఈసారి ఇందులో నటించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X