»   » ఇమేజ్ అంటూ ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకొన్న స్టార్ హీరో...

ఇమేజ్ అంటూ ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకొన్న స్టార్ హీరో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాభై ఏళ్లు దాటిపోయాయి కాబట్టి ఇక హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ తిరగడం సబబు కాదని వెంకటేష్ ఫీలవుతున్నాడు. పార్టీ ప్లస్ ఏజ్ లో 'వాయిస్ ఆఫ్ యూత్" అంటూ సినిమాలు చేసేసిన వెంకటేష్ ఇక అది మంచి పద్దతి కాదని గ్రహించాడు. అందుకే తన ఇమేజ్ మార్చుకుని కొత్త తరహా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే 'ఈనాడు" సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. హీరోయిన్ లేకుండా 'నాగవల్లి" సినిమాలో నటిస్తే ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. దాంతో తాను ఎలాంటి పాత్రలు చేస్తే కరెక్ట్ గా ఉంటుందనేది వెంకీకి అర్ధం కావడం లేదట. కథలైతే వింటున్నాడు కానీ వాటిలో ఏదో ఒకటి చేయడానికి మాత్రం కదలట్లేదు. వయసు పైబడడంతో ఇప్పటికే కాళ్లూ చేతులూ ఆధీనంలో లేకపోవడంతో పాటలు, ఫైట్లు ఉన్న సినిమాలు చేయడానికి ఓపిక చాలక, ప్రయోగాలకి పూనుకుని ప్లాపులు కొని తెచ్చుకోలేక పాపం విక్టరీ వెంకటేష్ చాలా వర్రీ అవుతున్నాడు. ఇమేజ్ అంటూ ప్రయోగాలు చేసి కష్టాలు కొనితెచ్చుకొన్నంత పనైంది..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu