'గోపాల గోపాల' : కొడుకు ఎంట్రీ ఖరారే కానీ సీక్రెట్

By Srikanya

హైదరాబాద్: హీరోల కొడుకు లాంచింగ్ అంటే ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. అభిమానులు తమ హీరో కుమారుడు నట విన్యాసాలు చూడటానికి సినిమాకి వెళ్తూంటారు. తాజాగా నిన్న జరిగిన 'గోపాల గోపాల' పూజా కార్యక్రమంలో వెంకటేష్ కొడుకు దగ్గుపాటి అర్జున్ కనిపించి అందరి దృష్టిలో పడ్డాడు. మీడియాలో కూడా ఈ చిన్నోడు గురించి చర్చ మొదలైంది. అయితే ఈ కుర్రాడు... ఈ చిత్రంలో వెంకటేష్ కుమారుడుగా కనిపించనున్నాడని వార్త వినపడుతోంది.

ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ద్వారా లాంచ్ అవటం మంచిదని తాత రామానాయుడు ఒప్పించారు అంటున్నారు. అయితే సర్పైజింగ్ ఎలిమెంట్ గా చిత్రంలో దీన్ని ఉంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే వెంకటేష్ అభిమానులకి ఆనందమే.

Venkatesh son in Gopala Gopala

తెలుగు తెరపై మరిన్ని మల్టీస్టారర్‌ సినిమాలకు సమయం ఆసన్నమైంది- ఇటీవల స్టార్‌ హీరోల నోటి నుంచి వస్తోన్న మాట ఇది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు' తర్వాత ఇలాంటి ప్రయత్నాలు వూపందుకున్నాయి. అందులో భాగంగానే వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' సినిమాను వీరిద్దరూ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'గోపాల గోపాల' అనే పేరును నిర్ణయించారు.

ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X