twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ తో శ్రీనువైట్ల ఆ రీమేక్

    By Srikanya
    |

    వెంకటేష్ రోజు రోజుకీ రీమేక్ ల మీద మక్కువ బాగా పెంచుకుంటున్నట్లున్నారు.ఆయన తాజాగా గోల్ మాల్ 3 చిత్రం రీమేక్ చేయటానకి కమిటయ్యారని సమాచారం.శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్తున్నారు.బాలీవుడ్ లో దాదాపు వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం చూసిన వెంకటేష్ వెంటనే శ్రీను వైట్లకి ఫోన్ చేసి చూడమని చెప్పి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది.వాళ్ళిద్దరూ కాంబినేషన్ లో వచ్చిన నమో వెంకటేశ చిత్రం వర్కవుట్ కాకపోయినా వెంకటేష్ కి శ్రీను కామిడీ టైమింగ్ మీద బాగా నమ్మకం కుదిరింది.

    ఇక ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రకు గానూ శ్రీకాంత్ ని అడిగినట్లు సమాచారం.హిందీలో ఆ పాత్రను అర్షద్ వార్సీ చేసారు. అయితే హీరోయిన్ పాత్ర నే మార్చాలనే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్తున్నారు.కోన వెంకట్ ని స్క్రిప్టు తిరగరాయమని చెప్పారని తెలుస్తోంది.కరీనా కపూర్ పాత్ర సినిమాకు హీరోయిన్ కాకపోవటంతో దానిని మార్చాలని నిర్ణయించుకున్నారు.ఇక అజయ్ దేవగన్ చేసిన పాత్రను వెంకటేష్ చేస్తారు.అయితే వీటిలో కొన్ని సీన్స్ ని రామానాయుడు నిర్మిస్తున్న ముగ్గరు లో లేపారని ఓ టాక్.అయితే తాము చేయబోయే చిత్రమే కాబట్టి సమస్య రాదని భావిస్తున్నారు.ప్రస్తుతం వెంకటేషశ్..బాడీగార్డ్ రీమేక్ లో బిజీగా ఉన్నారు.

    English summary
    Venkatesh is now planning to remake Bollywood super hit, Golmaal 3. Srinu Vytla is going to direct this flick and Srikanth will play the other important role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X