SAINDHAV: సంచలన స్టోరీతో వెంకీ మూవీ.. వామ్మో ఆ సీన్స్‌కు వణికిపోవడమే!
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన విక్టరీ వెంకటేష్ ఒకరు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చిన ఆయన.. తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్నారు. ఇలా 'ఎఫ్3' చిత్రంతో వచ్చి అదిరిపోయే కామెడీని పండించిన వెంకటేష్.. ఇటీవలే 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో తొలిసారి బోల్డుగా కనిపించి విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు ఆయన ఏకంగా పాన్ ఇండియా చిత్రంలోనే నటిస్తున్నారు.
చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' అనే సినిమా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆరంభంలోనే దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉండేలా చేశారు. ఇక, ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా చిత్రీకరణను బ్రేకులు లేకుండానే చేస్తూ వస్తున్నారు.

అదిరిపోయే కాంబోలో రాబోతున్న 'సైంధవ్' మూవీని సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిస్తోన్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీని వెనుక అసలైన బ్యాగ్‌డ్రాప్ బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) అని తెలిసింది. కర్నాటక రాష్ట్రంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో అక్కడ దీనిపై ప్రత్యేకమైన చట్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని ప్రధానాంశంగా తీసుకుని 'సైంధవ్' సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. చేతబడి అనే దాన్ని సైంటిఫిక్‌గా తప్పు అని నిరూపించడమే ఈ మూవీ ఉద్దేశం అని సమాచారం.
ఇదిలా ఉండగా.. వెంకటేష్ - శైలేష్ కొలను కలయికలో రాబోతున్న 'సైంధవ్' మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే, రుహానీ శర్మ, ఆండ్రియా, శ్రద్దా శ్రీనాథ్ ఇందులో నటిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











