కష్టాల్లో ఉన్న దర్శకుడు తేజాకి డి.సురేష్ బాబు దెబ్బ
తేజ దర్శకత్వంలో వెంకటేష్ .."సావిత్రి" అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రారింబించబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం పూర్తిగా అటకెక్కీసిందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం తీసుకున్న త్రిష డేట్స్ ని బాడీగార్డ్ రీమేక్ కు మార్చేసి ఆ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ చేసేస్తున్నారు. ఆ తర్వాత అయినా చిత్రం ప్రారంభమవుతుందా అంటే కాదన్నట్లే తెలుస్తోంది. కథలో పూర్తిగా ఇన్వాల్స్ అయిన సురేష్ బాబు ఇప్పటికీ కూడా దానిపై నమ్మకం పెంచుకోలేకపోయాడని అదే సినిమా ఆగిపోవటానికి కారణమని అంటున్నారు. అయినా సురేష్ బాబుకి ఇలా ప్రాజెక్టులు నాన్చటం అలవాటేనని, త్వరగా నిర్ణయం తీసుకోడని గతంలో ఆ క్యాంపస్ లో పనిచేసినవారు అంటూంటారు. అది నిజం కాబట్టే దాదాపు రెండున్నర ఏళ్ళుగా తేజ స్క్రిప్టుని అలా పెండింగ్ లో పెట్టాడని అంటున్నారు. అంతకు ముందు కూడా అమ్మరాజశేఖర్ తో గంగ ...ది డాన్ అనే చిత్రం ప్రకటించి ప్రక్కనపెట్టాడని, సెల్వ రాఘవన్ వంటి దర్శకుడుతో రానా హీరోగా ప్రారంభించిన సినిమా కూడా అలాగే కొద్దిరోజులు నడిపి ఆపుచేసాడు కాబట్టి ఈ తేజ, వెంకటేష్ కాంబినేషన్ విషయంలోనూ ఏమీ చెప్పలేమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











