ఆ యువ దర్శకుడి సినిమాను పక్కనపెట్టిన వెంకీ.. 75వ సినిమా కోసం న్యూ ప్లాన్
విక్టరీ వెంకటేష్ ఒకసారి ప్రాజెక్ట్ ఓకే చేశాడు అంటే చాలు షూటింగ్స్ చాలా తొందరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే వరుస అపజయాల తరువాత ఆయన స్టైల్ మారింది. F2 సక్సెస్ తో అలానే కంటిన్యూ అవ్వాలని.. కొంచెం కూడా సక్సెస్ ట్రాక్ ను మిస్ కావద్దని ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ వెంకీ మామ సినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక వెంకీ నెక్స్ట్ నారప్ప సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లలో అంచనాలు భారీగానే ఉన్నాయి. వెంకీకి ఇది 74వ సినిమా. అయితే 75వ సినిమా ఏ దర్శకుడితో చేస్తాడు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. అసలైతే త్రివిక్రమ్ తో చేయాల్సింది. కానీ త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో వర్క్ చేయనున్నాడు. ఇక యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా ఉంటుందని గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వస్తున్నాయి.

ఆ సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఉంటుందని టాక్ కూడా వచ్చింది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే వెంకీ ఆ దర్శకుడి సినిమాను ప్రస్తుతనికైతే పక్కన పెట్టినట్లు సమాచారం. 75వ సినిమా హై లెవెల్లో ఉండాలని ప్లాన్ చేంజ్ చేసినట్లు సమాచారం. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఎవరైనా సీనియర్ దర్శకులతో వర్క్ చేయాలనీ వెంకటేష్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











