వెంకీమామ సినిమాలో ధురంధర్ విలన్.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకటేష్ దగ్గుబాటి. ఈ కాంబో ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47 (Adarsha-Kutumbham)' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా సమపాళ్లలో ఉంటాయని సమాచారం. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతుండగా, సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజా గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో 'ధురంధర్ 2' విలన్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఇంతకీ ఏ నటుడు ఎవరు? త్రివిక్రమ్ ప్లానింగ్ ఎంటీ?

ఈ సినిమాలో వెంకటేష్ కు హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో నారా రోహిత్ వంటి నటులు కనిపించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సుమారు 150 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా కథనంపై కూడా ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే సుమారు 15 నిమిషాల కామెడీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అవుతుందట.

Venkatesh-Trivikram Film Adarsha Kutumbam Gets Dhurandhar 2 Villain Udaybir Sandhu Buzz

గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి చిత్రాల్లో కనిపించిన వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో మరింత ఎలివేట్ చేసేలా త్రివిక్రమ్ డిజైన్ చేశారని టాక్. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, నవ్వులు పూయించే ట్రాక్‌తో పాటు థ్రిల్ ఎలిమెంట్స్‌ను కూడా మిళితం చేసినట్టు తెలుస్తోంది.'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47 - AK47' ఒక పూర్తి ప్యాకేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ధురంధర్ నటుడు ప్రధాన పాత్రలో నటించబోతున్నారట.

ప్రస్తుతం ధురంధర్ 2: ది రివెంజ్ సినిమా క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.1,671 కోట్లకు చేరగా, ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ నుండి రూ. 1,263 కోట్లు, ఓవర్సీస్ నుండి రూ.408 కోట్లు వసూలయ్యాయి. నెట్ కలెక్షన్స్ కూడా రూ. 1,055 కోట్లకు చేరడం ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

కేవలం హిందీ వెర్షన్ ద్వారానే రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పటికీ రోజుకు దాదాపు రూ. 10 కోట్ల వరకు వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా త్వరలోనే రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరిపోయేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అలాంటి ధురంధర్ 2 లో పవర్‌ఫుల్ పాత్రతో నటించిన ఉదయబీర్ సంధు.. తాజాగా వెంకటేష్ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అతని రగ్గడ్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్ స్టైల్ కారణంగా త్రివిక్రమ్ అతన్ని ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ కాస్టింగ్‌పై ఫ్యాన్స్‌లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. త్రివిక్రమ్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కథలో హీరోతో సమానంగా నిలిచే విధంగా ప్రతినాయకుడిని డిజైన్ చేయడం ఆయన ప్రత్యేకత.

అదే ఫార్ములాను ఈసారి కూడా కొనసాగిస్తూ, వెంకటేష్‌కు ఒక స్ట్రాంగ్ ఆపోజిట్‌గా ఉదయబీర్ సంధును తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఫ్యామిలీ మూవీ కాదు, యాక్షన్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాగా కూడా ఉండబోతుందని ఈ కాస్టింగ్ సూచిస్తోంది.ఉదయబీర్ సంధు కాస్టింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడితే, ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయం. అలాగే, ఈ సినిమాకు పాన్ ఇండియా టచ్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నటు టాక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X