వెంకటేష్ ని కాదనటమే నిత్యామీనన్ కొంపముంచిందా
వెంకటేష్ సరసన నటించను అని చెప్పాను. దానికి కారణం ఉంది. ఆయన సీనియర్ హీరో కదా! జనరేషన్ గ్యాప్ వస్తుంది అంటూ నిత్యామీనన్ సీనియర్ హీరోల ప్రక్కన చేయను అని మొన్న మీడియా సమావేశంలో చెప్పింది. అందులో భాగంగానే 'ప్రభాస్ సరసన నటిస్తారా?' అని ప్రశ్నిస్తే - 'ఆయనెవరు?' అని అడిగి ట్విస్ట్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఇష్యూని అడ్డం పెట్టుకుని సీనియర్ హీరోలు నిత్యామీనన్ పై బ్యాన్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా కాకుండా అనీఫిషయల్ గా ఈ బ్యాన్ ఉంటుందని వినపడుతోంది. అసలు బాలకృష్ణ వంటి హీరోలకు హీరోయిన్స్ దొరక్క సలోని వంటి వారితో సర్దిపెట్టుకోవాల్సిన పరిస్ధితిలో ఇలా ఉన్న హీరోయిన్స్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి మిగతా వారిని కూడా చెడకొడుతున్నారంటున్నారు. త్రిష కాకుండా వెంకటేష్ కోసం హీరోయిన్స్ ని వెతికి అలిసిపోయి ఆమెనే మళ్ళీ తీసుకున్నారు. దాంతో నిత్యామీనన్ ఇలా అనటంతో వారికి బాగా కాలుతోంది.


Click it and Unblock the Notifications











