‘ఎఫ్ 2’... వెంకీ, వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ మ్యాటర్ లీక్?

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన 'ఎఫ్‌ 2-ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

మల్టీ స్టారర్ మూవీ కావడం... వెంకీ, తమన్నా లాంటి సీనియర్స్, వరుణ్ తేజ్, మెహ్రీన్ లాంటి జూనియర్ స్టార్స్ కలిసి నటించడంతో ఈ చిత్రానికి వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం చర్చనీయాంశం అయింది.

ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న వెంకీ

ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న వెంకీ

‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' చిత్రంలో నటించిన అగ్రహీరో వెంకటేష్ తన స్థాయికి తగిన విధంగా రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఎక్కువ భారం మోసింది కూడా ఆయనే కావడం గమనార్హం.

వరుణ్ తేజ్ ఎంత అందుకున్నాడు?

వరుణ్ తేజ్ ఎంత అందుకున్నాడు?

హీరో వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నటించినందుకుగాను రూ. 3.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ తోడల్లుడుగా, తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రలో వరుణ్ తేజ్ యాక్టింగ్ పరంగా అదరగొట్టారు.

తమన్నా, మెహ్రీన్

తమన్నా, మెహ్రీన్

ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్‌తో పోల్చితే తమన్నా టాప్ హీరోయిన్, సీనియర్ హీరోయిన్. దీంతో మన్నాకు రూ. 1 కోటి నుంచి కోటిన్నర మధ్యలో రెమ్యూనరేషన్ అందిందని, మెహ్రీన్ రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

సంక్రాంతి విన్నర్ ఎఫ్ 2

సంక్రాంతి విన్నర్ ఎఫ్ 2

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రమే సంక్రాంతి విజేతగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X