twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ రోజే రిలీజ్...హిట్టైతే వెంకటేష్ తో రీమేక్

    By Srikanya
    |

    బెంగళూరు : ప్రక్క రాష్ట్రంలో విడుదల అయ్యే చిత్రాలపై మనవాళ్లు ఓ కన్నేసి ఉంచుతూంటారు. ముఖ్యంగా రీమేక్ రాజాలైన మన దర్శకులు, హీరోలకు వీటిపై మరింత దృష్టి ఎక్కువ. ఈ రోజు ఎస్‌.ఎస్‌.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌.బి.భాగ్యమ్మ, సదాశివ నిర్మించిన కన్నడ చిత్రం పుంగిదాస సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. కోమల్‌, అస్మా జంటగా నటించారు. ప్రముఖ నటి షాహుకారు జానకి, సుదర్శన్‌ యుగళ గీతంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ చిత్రం విడుదల కోసం వెంకటేష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. హిట్టైతే తను రీమేక్ చేయాలని ఈ నిర్మాతలతో టచ్ లో ఉన్నారని కన్నడ మీడియా అంటోంది.

    Venkatesh waiting for 'Pungi Dasa' Result?

    ఇక ఈ చిత్రంలోని 'బ్లాక్‌ అండ్‌ వైటు....' పాటకు ఇప్పటికే అనూహ్య స్పందన లభించింది. యూట్యూబ్‌లో ఈ పాట హల్‌చల్‌ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 120 థియేటర్లలో పుంగిదాసను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. బి.సి.పాటిల్‌, ఆశిష్‌, తబలానాణి, కురిప్రతాప్‌, బులెట్‌ ప్రకాష్‌, పద్మజారావు, రాజేంద్ర కారంత్‌ ప్రధాన తారాగణం. సాహిత్యం- జయంత్‌ కాయ్కిణి, రాఘవేంద్ర కారంత్‌, కమల్‌సారథి, హరీష్‌ శృంగ, నృత్యరీతులు- మురళి, ఫోటోగ్రఫీ- అరుళ్‌, దర్శకత్వం- ఎం.ఎస్‌.శ్రీనాథ్‌.

    విడుదలకు ముందే కన్నడ చిత్రం పుంగిదాస సినిమాకు వివిధ భాషల నుంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటికే తమిళంలో రీమేక్‌ చేసేందుకు అక్కడి నిర్మాత ఒకరు హక్కుల్ని పొందారని చెప్తున్నారు. సినిమా ఆద్యంతం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. పుంగిదాస అంటే అబద్దాలు తడుముకోకుండా చెప్పేవాడని అర్దం. ఈ సినిమాలో హీరో చెప్పే అబద్దాలన్ని మంచి జరగటానికే ఉపయోగిస్తూంటాయి. అనుకోకుండా చెప్పిన ఓ పెద్ద అబద్దం వల్ల ఎలా హీరో ఇరుక్కుబోయి..బయిటపడ్డాడనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

    English summary
    'Pungi Dasa' is referred to a person who utters lies frequently. Such a character is played by top comedy hero Komal Kumar in the film. All the lies he utters is good for the situation. That is funny and timely. The situation for uttering lies is made very compact by MS Srinath who directed successful film 'Rambo'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X