ఆ మళయాళ రీమేక్ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్...
ప్రస్తుతం కన్నడ చిత్రం 'ఆప్త రక్షక' రీమేక్ చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో మళయాళ చిత్రం రీమేక్ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గీతా చిత్ర ప్రొడక్షన్స్..శివరాజు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఆయన గతంలో వెంకటేష్ తో పెళ్ళి చేసుకుందాం, పవిత్రబంధం చిత్రాలు నిర్మించారు. ఇక బాడీగార్డ్ చిత్రం మళయాళ దర్శకుడు సిద్దిక్ దర్సకత్వంలో రూపొందింది. దిలీప్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాదించింది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం రీమేక్ చేయాలా వద్దా అని వెంకటేష్ సంశయిస్తున్నారు. అయితే తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ ని చేస్తూండటంతో వెంకటేష్ సైతం ఆసక్తి చూపారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం దర్శకుడుగా విజయ్ భాస్కర్ ని ఎంపిక చేసే ఆలోచన ఉందని కూడా వార్తలు వినవస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ వెంకటేష్ ఈవిషయాన్ని అఫీషియల్ గా కన్పర్మ్ చేయలేదు.


Click it and Unblock the Notifications











