హాట్ టాపిక్: డైరక్టర్ కి వెంకటేష్ వార్నింగ్?

By Srikanya

హైదరాబాద్: గత రెండు రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే టాపిక్ వినపడుతోంది. తనతో కలిసుందాం రా,ప్రేమతో రా చిత్రాలు చేసిన దర్శకుడు ఉదయ్ శంకర్ కి హీరో వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. దానికి కారణం వెంకటేష్ ని ఉద్దేశించి మీడియాలో ఉదయ్ శంకర్ కామెంట్ చేయటమే అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించిన 'భీమవరం బుల్లోడు' చిత్రానికి ఆయన దర్శకుడు. చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెంకటేష్ ప్రసక్తి తెచ్చి హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఉదయ్ శంకర్ ఏమన్నాడు.

ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.... 'భీమవరం బుల్లోడు' మొదట వెంకటేశ్‌కు వినిపించాం. అయితే ఈ సినిమాలో రన్నింగ్, చేజింగ్ సీన్లతో కూడిన యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో తనకు ఇది నప్పదని ఆయన భావించారు. అదే సమయంలో 'పూలరంగడు' సినిమా వచ్చి, అందులో యాక్షన్ హీరోగానూ సునీల్ మెప్పించడంతో ఆయనకు ఈ పాత్ర బాగుంటుందనే ఉద్దేశంతో కథ వినిపించాం... అంటూ దర్శకుడు ఉదయ్ శంకర్ వివరించారు. దాంతో వెంకటేష్ తాను యాక్షన్ సీన్స్ చేయలేననే విషయం ఇలా డైరక్ట్ గా మీడియా వద్ద చెప్పటమేంటని దర్శకుడుపై సీరియస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇలాంటిది మరోసారి రిపీట్ కావటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

సునీల్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సునీల్ స్వతహాగా భీమవరం నుంచి వచ్చినవాడే కాబట్టి అక్కడి యాసతో బాగా పట్టుంది. అతని డైలాగులు అక్కడి యాసతోనే ఉంటాయి. శ్రీధర్ సీపాన రాసిన ఆ డైలాగుల్ని ఆయన చాలా బాగా చెప్పాడు. ఊళ్లో అమాయకంగా ఉంటే రాంబాబుకు ఏ అమ్మాయైనా నచ్చిందంటే ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందన్న మాటే. దాంతో ఏ అమ్మాయికి పెళ్లి కావాలన్నా, రాంబాబు వద్దకు వచ్చి ఆమె నచ్చిందని చెప్పమని జనం బతిమాలుకుంటూ ఉంటారు. ఆఖరుకి హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది. ఆమె తనకు నచ్చిందని చెప్పిన వెంటనే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. ఇలాంటి గమ్మత్తయిన ఈ పాత్రను ప్రేక్షకులు ప్రేమించకుండా ఉండలేరు అన్నారు.

నిర్మాత సురేశ్‌గారు అంత త్వరగా కన్విన్స్ కారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. ఆయన ఏ సినిమాకైనా ఓ నిర్మాతలా కాక, ఒక టెక్నీషియన్‌లాగా కష్టపడతారు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి, గుమ్మడికాయ కొట్టేదాకా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. సినిమా చూసుకున్నాక ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి ఇది హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. అక్షయ్‌కుమార్‌కు ఈ సినిమా బాగుంటుంది అన్నారు.

ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X