నాని లేదా రామ్ చరణ్.. ముందు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో?
ప్రస్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న కమర్షియల్ దర్శకులు చాలా బిజీ అవుతున్నారు. వారు కధ చెబితే ఎలాంటి హీరో అయినా ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ దర్శకుల లిస్ట్ లో వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు. మనోడి మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
నాగ శౌర్యతో చేసిన ఛలో సినిమాతో పాటు నితిన్ తో చేసిన భీష్మ సినిమా కమర్షియల్ గా మంచి లాభాలను అందుకున్నాయి. కామెడీ ప్లస్ యాక్షన్ ని మిక్స్ చేసి మంచి కమర్షియల్ సినిమాలను తెరకెక్కించగలడని ఇప్పటికే స్టార్ హీరోలు మెచ్చుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకీ మొదటి రెండు సినిమాల కంటే కూడా నెక్స్ట్ కొంచెం పెద్ద సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.

ఇటీవల రామ్ చరణ్ కోసం ఒక కథను సెట్ చేశాడనే టాక్ వచ్చింది. కథ నచ్చడంతో కాస్త పాజిటివ్ గా స్పందించిన చరణ్ ఇంకా చాలా టైమ్ ఉంది కదా.. కథలో ఇంకాస్త చేంజ్ చేయమని అడిగాడట. ఇక మరోవైపు నానికి కూడా ఒక వినిపించిన వెంకీ అక్కడ కూడా పాజిటివ్ కామెంట్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న టక్ జగదీశ్ సినిమా అయిపోగానే చేద్దామని ఒక మాట అన్నాడట గాని ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ముందుగా ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారితో సినిమాలు చేయాలని వెంకీ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











