వెంకీ మామపై కోట్లు కుమ్మరిస్తున్నారు.. భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా మారబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాకు 'వెంకీమామ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన 'వెంకీమామ' అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. 'వెంకీమామ' చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏరియాల్లో బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు వెంకీమామ సీడెడ్ హక్కులు 5.4 కోట్లకి అమ్ముడయ్యాయని తెలిసింది. అదేవిధంగా ఆంధ్ర ఏరియాలో 17 కోట్ల మేర బిజినెస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా 37 నుంచి 40 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అతిత్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











