కొనసాగుతున్న వెంకీమామ సస్పెన్స్.. అసలు కారణం ఏంటంటే!

రియల్ లైఫ్‌ మామ అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామ అల్లుళ్లుగా మారిన సంగతి తెలిసిందే. 'వెంకీ మామ' ద్వారా ఈ ఇద్దరు తెర పంచుకోనున్నారు. గ్రామీణ నేపథ్యంలో కలర్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయమై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండటం ఆసక్తికర అంశంగా మారింది.

నిజానికి వెంకీ మామ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఈ విషయమై ఇప్పటిదాకా సరైన అప్‌డేట్ రానేలేదు. పైగా ఎలాంటి ప్రమోషన్ హడావిడి కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందా? లేదా అనే డౌట్ వ్యక్తమవుతోంది జనాల్లో. కాగా వెంకీమామ విడుదల తేదీ విషయమై ఈ ఆలస్యానికి అసలు కారణం ఒకటి ఉందని ఫిలిం నగర్ టాక్.

Venky Mama Release Update.. Will release for sankranthi?

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉందట. ఇప్పటికే ఈ వర్క్ అంతా పూర్తయి అవుట్ పుట్ కూడా బయటకొచ్చిందని, కానీ ఆ గ్రాఫిక్స్ వర్క్ సురేశ్ బాబుకి నచ్చకపోవడం వలన తిరిగి వెనక్కి పంపించారని తెలుస్తోంది. మళ్ళీ ఆయన చెప్పిన అప్‌డేట్స్ తో ఆ వర్క్ ఫినిష్ చేసి.. అది సురేశ్ బాబుకి నచ్చితే, దానిని బట్టి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు.

ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X