వెంకీ చిత్రానికి అంతరాయం కలిగించింది లైలానా లేక నాగావల్లినా!
లైలా తుపాన్ సినీ పరిశ్రమను కూడా ఓ కుదుపు కుదిపేసింది. పలు చిత్రాలు మంచి రన్నింగ్ కండీషన్‌లో ఉన్నాయనుకుంటున్న సందర్భంలో లైలా తాకిడి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. అంతేగాక విజయనగరం కోస్తా తీరంలో 75 లక్షలతో ఖర్చు పెట్టి సెట్ వేసి అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న వెంకీ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా హీరో వెంకటేష్ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. 'నాగవల్లి' అనే పేరు నిర్ణయించినట్టు ఇండిస్టీ సమాచారం.
దీని షూటింగ్ విజయనగరం జిల్లాలో జరుగుతోంది. దీనికోసం కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ సెట్ అక్కడ వేసారు. హీరో వెంకటేష్ మరియు ఇతర నటీనటులపై ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దర్శకుడు పి.వాసు జరుపుతున్నారు. ఒక్కసారిగా లైలా తుపాన్ కోస్తా తీరాన్ని తాకడంతో వేసిన సెట్ మొత్తం ఆనవాళ్లు లేకుండా దెబ్బతింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే లైలా తుఫాన్ వల్ల కాదు ఇది నాగవల్లి ప్రభావమేనని అక్కడడక్కడా గాసిప్ వినిపిస్తోంది. కన్నడంలో విష్ణువర్థన్ మరణానికి కారణం చంధ్రముఖి సీక్వెల్ యే అని ఆ ఎఫెక్ట్ తో రజనీకాంత్ తెలుగు సీక్వెల్ సినిమా తీయలేదని దాంతో వెంటకటేష్ ముందుకొచ్చారు. అయితే ప్రభావానికి ప్రకతి ప్రభావమే తప్ప మరే ఇతర కారణాలు కావని వెంకటేష్ ఈ రూమర్స్ ని లెక్కచేయకుండా మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చెస్తానని అన్నట్టు వినికిడి. దాంతో మరో కొత్త సెట్ వేయడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారని సమాచారం, మరికొద్దిరోజుల్లో తిరగి షూటింగ్ ప్రారంభించనున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











