twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్ : ప్రభాస్-వెంకటేష్ కాంబినేష్ లో...

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మల్టి స్టారర్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ ని మొదలు పెట్టిన దిల్ రాజు మరో మల్టి స్టారర్ ని సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. ఈ సారి ప్రబాస్, వెంకటేష్ కాంబినేషన్ కి తెర తీస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య కథ అందించనున్నట్లు, విరాజ్ అనే దర్శకుడు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే వెంకటేష్ సరసన త్రిష,ప్రభాస్ సరసన కాజల్ ని ఎంపిక చేసారని చెప్పుకుంటున్నారు. అలాగే చిత్రానికి సూర్యుడు- చంద్రుడు అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.

    వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతుున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. వెంకటేష్,మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ చిత్రంలో కనపించనున్నారు. అంజలి..మహేష్ కు వదినగా చేస్తోంది.

    ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.

    .''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

    English summary
    
 Venkatesh is getting ready for another multi-starrer film after "Seethamma Vakitlo Sirimalle Chettu", which is all set for grand release in January.Now the latest news is that Venkatesh and Young Rebel Star Prabhas are teaming up for a new film tentatively titled "Suryudu-Chandrudu".This new project will be produced by Dil Raju, who is currently producing the true-multistarrer film SVSC with Venky and Mahesh in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X