Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ న్యూస్ : ప్రభాస్-వెంకటేష్ కాంబినేష్ లో...
హైదరాబాద్ : 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మల్టి స్టారర్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ ని మొదలు పెట్టిన దిల్ రాజు మరో మల్టి స్టారర్ ని సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. ఈ సారి ప్రబాస్, వెంకటేష్ కాంబినేషన్ కి తెర తీస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య కథ అందించనున్నట్లు, విరాజ్ అనే దర్శకుడు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే వెంకటేష్ సరసన త్రిష,ప్రభాస్ సరసన కాజల్ ని ఎంపిక చేసారని చెప్పుకుంటున్నారు. అలాగే చిత్రానికి సూర్యుడు- చంద్రుడు అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.
వెంకటేష్, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతుున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. వెంకటేష్,మహేష్ బాబు అన్నదమ్ములుగా ఈ చిత్రంలో కనపించనున్నారు. అంజలి..మహేష్ కు వదినగా చేస్తోంది.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.
.''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.