వెంకటేష్, తేజ కాంబినేషన్ 'సావిత్రి' ఆగిపోవటానికి అసలు కారణం అదా?
కేక వంటి డిజాస్టర్ ని అందించిన తేజ దర్శకత్వంలో వెంకటేష్ .."సావిత్రి" అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రారింబించబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం అటకెక్కినట్లేనని కన్ఫర్మ్ గా వినపడుతోంది. దానికి కారణం తమిళంలో త్వరలో రిలీజ్ కానున్న విక్రమ్ చిత్రం దేవమగన్ అని తెలుస్తోంది. ఆ చిత్రంలో విక్రమ్..మెంటల్లీ రిటార్టెడ్ పర్సన్ గా కనిపిస్తారు.హాలీవుడ్ చిత్రం ఐయామ్ శామ్ ఆదారంగా రూపొందిన ఆ చిత్రంలో విక్రమ్ వయస్సు ఐదేళ్లలోనే ఆగిపోతుంది. అదే పాయింట్ తోనే వెంకటేష్ కథ కూడా రెడి అయ్యిందని చెప్తున్నారు.
వెంకటేష్ కోసం తేజ రూపొందించిన స్క్రిప్టులోనూ వెంకటేష్ గతంలో చేసిన చంటి తరహా మానసిక పరిస్ధితిలో ఉన్న యువకుడు కథ.రెండు కథలు క్లాష్ అవుతాయని ఈ ప్రాజెక్టు ఆపుచేసినట్లు చెప్తున్నారు. అందులోనూ విక్రమ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్దమైంది.అది ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతుంది.అప్పుడు అంతా ఆ చిత్రం చూసి వెంకటేష్ సినిమా చేసారంటారనే భయంతో ఆపారని చెప్తున్నారు.అయితే సురేష్ బాబు మాత్రం హీరోయిన్ దొరక్కే ప్రాజెక్టు లేటవుతోంది అంటున్నారు.సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ నిర్మించే చిత్రానికి హీరోయిన్ దొరకటం లేదంటే ఎవరైనా నమ్ముతారా..


Click it and Unblock the Notifications











