మోనాల్ గజ్జర్ పేరు చెప్పే వెన్నెల కిషోర్ బిజినెస్
హైదరాబాద్ : అల్లరి నరేష్ చిత్రం సుడిగాడుతో హీరోయిన్ గా పరిచయమైంది మోనాల్ గజ్జర్. సినిమా విజయవంతం కావటంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె తదుపరి చిత్రం బిజినెస్ కి ఆ క్రేజ్ ఉపయోగపడుతోందని తెలుస్తోంది. ఆమె మొదట వెన్నల కిషోర్ దర్శకత్వంలో 'వెన్నెల వన్నండాఫ్' చిత్రంలో చేసారు. అయితే ఆ చిత్రం విడుదల లేటైంది. ఈ లోగా సుడిగాడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు 'వెన్నెల వన్నండాఫ్'విడుదల కాబోతోంది. ఆమె హీరోయిన్ కావటంతో మంచి బిజినెస్ జరుగుతోందని సమాచారం.
'వెన్నెల' చిత్రం ద్వారా పరిచయమై, హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు కిశోర్. ఒకవైపు నటుడిగా కొనసాగుతూ మరోవైపు ఆయన 'వెన్నెల వన్నండాఫ్' చిత్రానికి దరక్శకత్వం వహించారు. 'వెన్నెల'కు సీక్వెల్ ఇది. ఈ నెల రెండో వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వర్మ మాట్లాడుతూ -''సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వినోదంగా సాగుతుంది. వంద శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. సునిల్‌కశ్యప్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై వాసు, వర్మ 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో విడుదలైన 'వెన్నెల' చిత్రానికి ఇది కొనసాగింపు. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వాసు మాట్లాడుతూ ''మా చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. వినోదానికి పెద్ద పీట వేసిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం మాకుంది'' అని తెలిపారు.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'వెన్నెల 1 1/2' చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఫోటోగ్రఫీ: సురేష్ భార్గవ్, సాహిత్యం: కృష్ణ చైతన్య, శ్రీమణి, సిరాశ్రీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











