వెన్నెల కిషోర్ ‘డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’!?
తాజాగా వెన్నెల కిషోర్‌పై ఓ కాంట్రవర్సీ న్యూస్ వినిపిస్తోంది. 'డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' అనే చిత్రంలో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడని, ఈ చిత్రం షూటింగ్ సైలెంట్‌గా, సీక్రెట్‌గా సాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన వారే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.
వివాదాలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు. అలాంటి రామ్ గోపాల్ వర్మ పేరుతో కాంట్రవర్సీగా చిత్రం రూపొందుతుందనే విషయం తెలియడంతో ఫిల్మ్ నగర్లో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చిత్రం విషయం ముందే తెలిస్తే షూటింగుకు అడ్డంకులు తగులుతాయనే ఉద్దేశ్యంతోనే రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా ఏ ఉద్దేశ్యంతో ఈచిత్రం తీస్తున్నారో..? అసలు రామ్ గోపాల్ వర్మకు ఈచిత్రానికి ఏమైనా సంబంధం ఉందా? కేవలం రామ్ గోపాల్ వర్మ పేరును వాడుకుని సినిమాపై అంచనాలు పెంచడానికే ఇలాంటి టైటిల్ పెట్టారా? వెన్నెల కిషోర్ పాత్ర ఏమిటి? అసలు 'డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' అనే సినిమా రూపొందుతుందనే వార్తల్లో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












