బాబు...మళ్లీ డైరక్షన్ చేస్తానంటున్నాడు

By Srikanya

Vennela Kishore trying again as Director
హైదరాబాద్ : నటుడుగా మంచి స్ధాయిలో ఉన్నప్పుడు ప్రక్కవాళ్లు ఎగదోస్తారో ఏమో కానీ డైరక్షన్ పిచ్చి పడుతూంటుంది. అదే వెన్నెల కిషోర్ లాంటి వాళ్లకు శాపం అవుతుంది. ఓ ప్రక్క వేషాలు వదులుకోలేక, చేస్తున్న డైరక్షన్ పై పూర్తి దృష్టి పెట్టలేక భాక్సాఫీస్ వద్ద ఢమాల్ అవుతూంటారు. కమిడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న వెన్నెల కిషోర్ కి మళ్లీ డైరక్షన్ చేయాలనే కోరిక పుడుతోందిట. అందుకోసం స్క్రిప్టులని రెడీ చేసుకుని నిర్మాతలను పట్టే పనిలో పడ్డాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

గతంలో వెన్నెల వన్ అండ్ హాఫ్, జఫ్పా చిత్రాలని డైరక్ట్ చేసాడు. రెండు డిజాస్టర్ చిత్రాలుగా నమోదు అయ్యాయి. మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా సినిమాలు డైరక్ట్ చేసాడంటూ విమర్శలు వినిపించాయి. అవన్నీ డోంట్ కేర్ అని మళ్ళీ తన పరిచయాలతో మరో చిత్రం పట్టే పనిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే వెన్నెల కిషోర్..దర్శకత్వ యావ ...మిగతా దర్శకులకు మండిపోతోంది. తాము వృత్తి రీత్యా దర్శకులం కాబట్టి ప్రయత్నాలు చేసుకోవాలి...ఇలా నటులుగా మంచి స్ధాయిలో ఉన్నవారు కూడా పోటికి వస్తే ఎలా అంటున్నారు. దర్శకులకు కోపం వస్తే తర్వాత వేషాలు కూడా ఉండవు అంటున్నారు.

మరో ప్రక్క వెన్నల కిషోర్ హీరోగా చేసిన 'అతడు... ఆమె... ఓ స్కూటర్' చిత్రం వర్కవుట్ కాలేదు. అలాగే చిన్న వయసులో తండ్రి అయిన ఓ వ్యక్తి తన కూతురి వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతని జీవితంలో వచ్చిన మార్పులేమిటనే కథాంశంతో 'డాటర్ ఆఫ్ వర్మ' కూడా ఆర్బాటంగా మొదలైంది కానీ అది ఏమైందో అతీ గతీ లేదు. ఆ దెబ్బకు వెన్నెల కిషోర్ హీరోగా హీరోగా సినిమా అంటే భయపడిపోతున్నారు.

వెన్నెల సినిమాలో ఖాదర్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కిషోర్ ఆ సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్ గా సెటిల్ అయ్యాడు. ఆ సినిమా తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే వెన్నెల 1 1/2 సినిమాతో దర్శకుడిగా మారిపోయారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు తర్వాత కిషోర్ హీరోగా చిత్రాలు సైతం చేసాడు. అవీ పెద్దగా అతని కెరీర్ కి ప్లస్ కాలేదు. దాంతో తిరిగి కమిడియన్ గానే ప్రస్దానం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ఆగడులో కీలకమైన పాత్రను చేస్తున్నాడు. చిన్నా, పెద్దా సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నాడు. కమిడియన్ గా అతనికి కంటిన్యూగా చిత్రాలు ఉంటూనే వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X