మన తెలుగులో మల్టి కాంబినేషన్ సినిమాలు రావటం లేదని ఎవరన్నారని మనం ధైర్యంగా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒకప్రక్క జగపతి బాబు ఆ తరహాలో ముందుకువెళ్తుంటే...అతనికి తోడుగా వేణు కూడా రంగంలోకి దిగుతున్నాడు. యేదన్నా అంటే యేం శ్రీకాంత్ తో 'పెళ్ళాం ఊరిళితే' చెయ్యలేదా...తర్వాత 'శ్రీకృష్ణ 2005' చెయ్యలేదా లేక మొన్నటికి మొన్న 'యమగోల మళ్ళీ మొదలైంది' చెయ్యలేదా నాకేం కొత్త కాదు అంటున్నాడు. తాజాగా వేణు ...వెంకటేష్ 'చింతకాయల రవి' లో ఓ పాత్రని చేస్తున్నాడని తెలుస్తోంది. పాత్ర యేమిటన్నది బయిటకు రాలేదు గానీ దానికోసం అతనికి బాగానే ముట్టచెబుతున్నారని తెలుస్తోంది. మరి అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గానే ఉంది. యేదైమైనా అసలు వేషాలు లేకుండా గడపటం కన్నా ఇలాంటి సెకండ్ హీరో ఛాన్స్ లు మేలే కదా....
Story first published: Monday, July 13, 2026, 19:00 [IST]