వేణు మాధవ్...ఇక ఎయిడ్స్ అప్పారావు
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తాజాగా ఎయిడ్స్ పాపారావ్ క్యారెక్టర్ లో నవ్వించబోతున్నట్లు సమాచారం. త్వరలో రిలీజ్ కానున్న స్నేహగీతం చిత్రంలో వేణు మాధవ్ ఈ ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు. అయితే ఈ సారి ఎయిడ్స్ డెఫ్నిషయన్ మారనుంది. ఈ చిత్రంలో అతని పాత్ర ప్రకారం ఎయిడ్స్ అంటే...అటెండన్స్ ఫర్ ఇంటర్నల్స్ డిఫెషెన్సీ సిండ్రోమ్. ఇక విచిత్రమైన రోగం గురించి తెలుసుకోవాలంటే రిలీజ్ అయ్యే ఆగాల్సిందే అంటున్నారు. మే మొదటివారంలో రిలీజ్ అయ్యే ఈ చిత్రంలో వేణుమాధవ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆడియో రంగంలో పేరున్న మధురా శ్రీధర్ డైరక్ట్ చేస్తున్నారు. అలాగే లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా హీరో, హీరోయిన్స్ కొత్తవారు పరిచయమవుతున్నారు. ఇక పాటల్ని గ్రేట్ ఆంధ్రా డాట్ కాం సిరాశ్రీ తనదైన శైలిలో సాహిత్య పరిమళాల్ని విరబూయిస్తూ రాసారు.


Click it and Unblock the Notifications











