కమిలినీ ముఖర్జీతో కంటిన్యూ అవుతానంటున్న హీరో
శేఖర్ కమ్ముల పరిచయం చేసిన కమిలీనీ ముఖర్జీకి ఈ మధ్య పెద్దగా బేరాలు లేదు. అయితే రీసెంట్ గా ఆమె వేణు ప్రక్కన బుక్కయింది. గతంలో కమిలినీ ముఖర్జీతో గోపి..గోపిక...గోదావరి చిత్రం చేసిన హీరో వేణు తన తదుపరి చిత్రానికి కూడా ఆమెనే హీరోయిన్ గా రికమెండ్ చేసారని సమాచారం. ఎస్.పి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కమిలినీని హీరోయిన్ గా ఎంపికచేసారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం ఓ కామిడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ఓ మళయాళ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నడుస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే షూటింగ్ కు పోనుంది. గతంలో ఎస్.పి.ఎన్టర్టైన్మెంట్ పతాకంపై వేణు హీరోగా స్వయంవరం, చిరునవ్వుతో చిత్రాలు వచ్చిన సంగతి తెలిసింది. ఇక ఈ చిత్రం అన్నా హిట్టయి వేణుకు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్టయ్యేలా చేస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











