పవన్ కల్యాణ్ తర్వాత ప్రభాసే.. యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. చాలా రోజుల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోగానే పేరొందిన అతడు.. కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. సీనియర్ హీరో కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తర్వాత ప్రభాస్ నటించబోయే 22వ సినిమా గురించి తొలిసారి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

రెండు సినిమాలు మొత్తం మార్చేశాయి
‘ఈశ్వర్' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత పలు విజయాలను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో నేషనల్ లెవెల్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘సాహో' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.

లవర్ బాయ్ అవతారం ఎత్తిన ప్రభాస్
‘సాహో' వంటి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈసారి పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు
రాధాకృష్ణతో చేస్తున్న మూవీ తర్వాత ప్రభాస్.. ‘మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాలో నటిస్తున్నాడు. దీన్ని బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రాబోతుందని దర్శకుడు ఇటీవలే ప్రకటించాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే దీని కథ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే.!
నాగ్ అశ్విన్‌తో సినిమా పట్టాలెక్కక ముందే దాని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నది ఎవరో కాదు.. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. అవును.. యంగ్ రెబెల్ స్టార్ చేయబోయే 22వ సినిమాను తన బ్యానర్‌లో చేసేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

పవన్ కల్యాణ్ తర్వాత యంగ్ రెబెల్ స్టారే
దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి ‘వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం అతడు లాక్‌డౌన్ పిరియడ్‌లో అద్భుతమైన కథను సిద్ధం చేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ స్క్రిప్టును ప్రభాస్‌కు వినిపించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఇది ఓకే అయితే పవన్ తర్వాత ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తాడు వేణు శ్రీరామ్.


Click it and Unblock the Notifications











